"గర్భిణీ స్త్రీలను జాగ్రత్తగా చూసుకుందాం"
గురువారం 2021 జూలై 1వ తారీఖున ‘రోటరీ’ సేవా సంస్థ నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న శుభతరుణంలో రోటరీ అంతర్జాతీయ జిల్లా 3020 గవర్నర్ శ్రీయుతులు ఎం.రామారావు గారి పిలుపు మేరకు, రోటరీ అంతర్జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శేఖర్ మెహతా గారి ఇతివృత్తంలో భాగమైన "గర్భిణీ స్త్రీలను జాగ్రత్తగా చూసుకుందాం" అనే నినాదంతో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ వారికి ‘ఆహారం-ఆరోగ్యం’ వివరాలతో ఉన్న పుస్తకాలు, రాగులు, సజ్జలు, జొన్నలు తదితర చిరుధాన్యాలన్నీ కలగలసిన పొడులు, బిస్కెట్ పాకెట్స్ అందజేయడం ద్వారా మొదటి సేవాకార్యక్రమం చేయడానికి "రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్" సభ్యులం శ్రీకారం చుట్టాము.
కార్యక్రమ వేదిక : విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి లోని ‘గైనకాలజీ ’ విభాగం లో
తేదీ: గురువారం, 01-జూలై-2021 సమయం: ఉదయం 11 గంటలకు
అధ్యక్షులు: కాకరపర్తి రవి కుమార్ :: కార్యదర్శి: సుంకర నాగభూషణం
రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్